వేసవిలో స్వేదం ఎక్కువగానే ఉంటుంది. ఈ స్వేదం యాంటీ పరిస్పింట్స్ కలిసి ధరించే వస్త్రాలపై చేతుల కింద పసుపు పచ్చగా లేదా డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. వీటిని చల్లని నీటితో పావుగంట నానాబెట్టి రుద్దితే లవణాలు కరుగుతాయి. లేత రంగు షర్టులు,జాకెట్లపై ఈ మరకలు కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జైంట్ల్లో 15నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో నాననివ్వాలి. స్వేదానికి వాసన ఉండదు. కానీ చర్మంపై గల బాక్టీరియాతో కలిసి వాసన వస్తుంది. ప్యాబ్రిక్స్ వీటిని పీల్చుకొని చమట వాసన వేస్తాయి. ప్రతి మిషన్ వాష్ లో లేదా హాండ్ వాష్ బకెట్ లో ఒక కప్పు బేకింగ్ సోడా వేస్తే స్వేదం వాసనలు బాక్టీరియా నశిస్తాయి.

Leave a comment