నేనొక  తండ్రిగా ప్లాయిడ్ కూతురికి ఎప్పటికైనా సంజాయిషీ ఇచ్చుకో వలసి  ఉంటుంది.వాళ్ల డాడీ కోసం నువ్వేం చేసావు అని ఆ చిన్నారి నన్ను ప్రశ్నించవచ్చు అప్పుడు నేను ఇవ్వగలిగిన సమాధానం ఇదే.నా బోర్డ్ పదవిని ఒక నల్లజాతి వ్యక్తి కోసం ఇచ్చేస్తున్న అన్నారు రేడిట్  వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియాన్  ఆయన తన పదవిని రాజీనామా చేశారు.నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ హత్యోదంతంపై అమెరికా అంతా వెల్లువెత్తిన నిరసన జ్వాలలకు మద్దతుగా అలెక్సిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.అలెక్సిస్ ప్రముఖ టెన్నిస్ స్టార్ విలియమ్ సెరెనా భర్త. వాళ్లకు పాప ఉంది.పేరు ఒలింపియా.దొంగ నోట్లు ఇచ్చాడన్న కారణంగా ప్లాయిడ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని మెడపై మోకాలితో నొక్కి పట్టితే  ప్లాయిడ్ ఊపిరి అందక మరణించిన విషయం పైన అమెరికా లో నిరసన మొదలైంది.

Leave a comment