అనుబంధాలు బీటలు పడినప్పుడో లేదా ఆత్మీయుల మరణం తర్వాతనో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అప్పుడు దిగులు పడకుండా మనం మనలాగా ఉండటం నేర్చుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే ఒంటరితనం మనశ్శాంతిని పూర్తిగా మాయం చేయవచ్చు. కానీ అలాంటప్పుడే మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి. ఒంటరి ప్రయాణాలు మొదలు పెట్టాలి. కొత్త ప్రదేశాలను వెతకటం ,కొత్త మనుషులను కలుసుకోవటంలో కొంత శాంతి చిక్కుతుంది. సృజనాత్మకత వృద్ధి చేసుకొని ఏదైనా బ్లాగ్ లేదా పుస్తకం రాసేందుకు ప్రయాత్నం చేయవచ్చు. అసలు ముందు చేయాలానుకొన్నవి ,భవిష్యత్తుని వెలిగించేవి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. శరీరంపై శ్రధ్ధ పెట్టాలి.ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.ఏదైనా సేవసంస్థల్లో భాగాస్వాములై అవసరమైన వారికి కాస్త సాయం అందించాలి. ఒంటరిగా సంతోషంగా ఎలా ఉండచ్చో సమాధానం దొరుకుంతుంది.
Categories