-డి. సుజాతా దేవి

తోట దాటేవరకు
తోడు రారా మామ
ఏటి మలుపున తోట
తోట దాటితే పేట!!

మబ్బులో బూతమెదో
మంత్రమెడతది నాకు
జుట్లు విరబోసుకుని
సెట్లు బయ పెడతాయి!!

ఒంటిగున్నానంటె
కన్ను గొట్టు సెందురుడు
ఏటి గాలులు నన్ను
వాటేసుకుంటాయి!!

ఏటి దిబ్బల మీద
ఎన్నెల పడకేసింది
తోట కనుగప్పి పూల
వాసన నను కమ్మింది!!

Leave a comment