నటులు, రచయిత్రులు మహిళా డైరక్టర్లు ఇతర రంగాల్లోని ప్రాముఖ మహిళలందరిలో మొత్తం 300 మంది తో టైమ్ ఈజ్ అప్ అనే కొత్త ఉద్యమం హాలీవుడ్ లో మొదలైంది  మీటూ ఉద్యమానికి ఇది కొనసాగింపు. టైమ్స్ అప్ యు.ఎస్ లోని అన్ని రంగాల్లో వున్నా లైంగిక బాధితుల కోసం న్యాయ పోరాటం చేయబోతుంది. ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు సామాన్యులైనా, సుప్రసిద్దులైనా, వాళ్ళ కంప్లయింట్ తీసుకుని, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష వేయించటం టైమ్స్ అప్ లక్ష్యం. ఇందుకు అవసరమైన ఖర్చులకోసం ఈ ప్యానెల్ 13.4 మిలియన్ విరాళాలు సేకరించింది.    టార్గెట్   అమౌంట్ 15 మిలియన్ డాలర్లు.   కేట్ బ్లాంబెట్, ఆష్ లీజర్, నటాలీ ఫోర్డ్ మన్ రాషీర జోన్స్ ప్రముఖ మహిళలు ఇందులో సభ్యులుగా వున్నారు.

Leave a comment