అధికారమంతా ఎప్పుడు మగవాళ్లదేనా ? నేను సోలో హీరోయిన్ గా చేసిన నాటి నుంచి సినిమాలో తుది నిర్ణయాలన్ని నా ఇష్ట ప్రకారమే వుండాలనుకున్న అంటోంది నయన తారా . సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటర్ అంటారు. నిజమే. కానీ స్త్రీలు  శాసించే స్థాయులో ఉంటే కూడా ఉండవలసినంత దైర్యంగా ఉండరు . నాకు ఫలానిది కావాలి . నాకిలా వుంటే ఇష్టం అనిచెప్పారు. కానీ నేనలా నిలబడ్డాను ఇది జండర్ తో సంబంధం లేని వ్యవహరం. మనం ముందు స్థిరంగా నిలబడాలి నేను నీమాట వింటున్న, నీవు కూడా నా మాట వినాలి అని చెప్పగలగాలి . నేనైతే నాకేం కావాలో చెప్తాను. అలాగే చేస్తారు కూడా . నేనాశక్తి సంపాదించేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు అంటోంది నయనతార .

Leave a comment