బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లగే దానిమ్మ టీ లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. దానిమ్మ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేషన్‌ వల్ల చర్మకణాలు దెబ్బతినడాన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడాన్ని నిరోధిస్తుంది. దానిమ్మ టీ తయారు చేసేందుకు ముందుగా గింజల నుంచి జ్యూస్ తీసి పంచదార కలుపుకొని ఒక జార్‌లోకి నిల్వచేసుకోవచ్చు. టీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ జ్యూస్ ని వాడుకోవచ్చు ఇది నెల రోజు లైనా నిల్వ వుంటుంది. నీళ్లు మరిగించి ఈ దానిమ్మ జ్యూస్ కలిపి తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ టీ లో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలుంటాయి.

Leave a comment