Categories
నెలసరి శుభ్రత విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అలర్జీలు మొదలుకొని క్యాన్సర్ వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు .తిరిగి వాడుకో గలిగే ప్యాడ్ లు సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తాయి. ప్యాడ్ టాంపూన్లు పీరియడ్ ప్యాంటీలు బయోడిగ్రేడబుల్ రకాలు ఎంచుకోవాలి. ఇవి భూమి పై వ్యర్ధాలు మిగల్చకుండా పర్యావరణ హితంగా ఉంటాయి. శానిటరీ నాప్కిన్లు రెండు మూడు గంటలకోసారి మార్చుకోవాలి. పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని నీరు గాఢత తక్కువగా ఉండే సబ్బులు వాడాలి.పెరుగు, ఒమేగా-3 అధికంగా ఉండే డ్రై నట్స్ తాజా కూరగాయలు తాజా పండ్లు ఆహారం లో తీసుకుంటే ఒత్తిడి తగ్గి నెలసరి తో వచ్చే చిరాకులు రావు.