ఏ సినిమా వేసిన ముందు,పొగ తాగడం హానికరం అనే యాడ్ కనిపిస్తుంది.ఎంత బయపెట్టిన పొగతాగే అలవాటు దాదాపు సగం మంది జనభాకి ఎక్కువే ఉంది.నేరుగా పొగ తాగితే ఫస్ట్ హ్యాండ్ స్మోకర్ అంటే వాళ్ళ పక్కనే ఉండే వాళ్ళని ఫ్యాసివ్ స్మోకర్ అంటారు. పొగ తాగిన ప్రదేశంలో కాసేపటి తర్వాత వెళ్ళి అక్కడ గడిపిన వాళ్ళని థర్డ్ హ్యాండ్ స్మోకర్ అంటారు. ఆ ప్రదేశలో ఉండే చిన్న పిల్లల రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల్లో రక్తకణాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని భవిష్యత్ లో వాళ్ళు అనేక అనారోగ్యాల భారిన పడతారని హెచ్చరిస్తున్నారు. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రభావం వల్ల గర్భవతుల్లో పిండం ఎదుగుదల్లో దుష్ప్రభావాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Leave a comment