ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాల్లో కూడా పచ్చని చెట్లు పెంచాలనే కాన్సెప్ట్ తో మొక్కలు నాటుతున్నారు. కానీ నగరంలో నాటిన మొక్కలు 13శాతం మాత్రమే బతుకుతున్నట్లు ఒక రిపోర్టు. ఇలాంటి పరిస్థి ప్రతి చోట ఉంది.గుజరాత్ లో వడోదరలో గ్రీన్ అంబులెన్స్ అనే పథకం మొదలైంది. మొక్కలు ఎండిపోతున్నాయని చిన్న కబురు అందినా చాలు చెట్ల సంరక్షణకు అవసరమైన వస్తువులతో మూడు చక్రాల గ్రీన్ అంబులెన్స్ బయలు దేరుతుంది. ఢిల్లీ ప్రభుత్వం చాల కాలం క్రితమే ట్రీ హెల్ప్ లైన్ ప్రారంభించింది.చత్తీస్ ఘడ్ లో అంబికా పూర్ లోని శిక్షక్ కుటీర్ అనే స్కూల్ చెట్ల సంరక్షణకు కొత్త పథకం పెట్టింది.పిల్లలను స్కూల్లో చేర్చే పెరెంట్స్ కొన్ని మొక్కలు నాటాలి.
ఫీజులు కట్టలేకపోయినా కొన్ని మొక్కలు పాతి సంరక్షిస్తే చాలు. ఇలాంటి సంస్థలు పూనుకుంటె కాంక్రీట్ జంగిల్ కూడా అరణ్యంలా పచ్చగా ఐపోదు!

Leave a comment