Categories
జీవితంలో కెరీర్ చాలా ఇంపార్టెంట్.కష్టపడి అత్యున్నత స్థాయి వరకు ఎదగాలని అందరికీ ఉంటుంది.కానీ ఒక చోటికి చేరుకున్నాక కొందరు అలా ఎదగటం మానేస్తారు.అలా మానేయకుండా ఉండాలంటే మనలో ఒక బలమైన కాంక్ష పనిచేస్తూ ఉండాలి. దానికి మన చుట్టు ఉన్న పరిస్థితులు తోడ్పడాలి అంటోంది రాశిఖన్నా. మనచుట్టు ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటే మన ఎదుగుదల స్పీడ్ గా ఉంటుంది.ఎవరో పట్టించుకొనే వాళ్ళు లేకపోయినా థ్రిల్ ఉండదు. ప్రశంసలతో పాటు విమర్శలూ మనల్ని ముందుకు నడిపిస్తాయి అంటోంది రాశిఖన్నా. మనపట్ల ఎదుటివాళ్ళకు ఉండే నమ్మకమే నా కెరీర్ గ్రాఫ్ గీస్తున్నాయని నాకు తెలుసు. మనల్ని నమ్మి ఎదుటివాళ్ళు కథల్ని సృష్టిస్తారు. సినిమా తీస్తున్నారంటే అర్థం అదేకదా అంటోంది రాశిఖన్నా.