Categories

చిరు ధాన్యాల వల్ల శరీరానికి లభించే కార్భోహైడ్రేడ్స్ తో నోటి ఆరోగ్యం బావుంటుందని నోటి క్యాన్సర్ ముప్పు దాదాపు తొలగిపోతుందని చెపుతున్నాయి అధ్యయనాలు. ఐదు వేల మంది ఆహారపు అలవాట్లపై జరిపిన సుదీర్ఘమైన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో కేవలం చిరుధాన్యాలు తీసుకొనే వాళ్ళు 30 శాతంగా ఉంటే మిగిలిన వారు ,చిరు ధాన్యాలతో పాటు ఇతర ఆహారపదార్థాలను కూడా తీసుకొంటారు.కొన్ని నెలలకే చిరుధాన్యాలు తీసుకొనే వారిలో నోటి సమస్యలు ఏవీ లేవు .చిరుధాన్యాల వల్ల అందుతున్న పిండిపదార్ధాల వల్లనే వారిలో దంతక్షయం కనించటం లేదని ,నోరు ,దంతాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది.