అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ  వల్ల  కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక అబద్దాల చెప్పటం వాళ్ళ కలిగే మానసిక స్థితి శరీరానికి అహంకారం చేసే లాగే ఉంటుందిట. ఇక పరీక్షలు నిర్వహించిన వారిలో సగం మందికి అబద్దాలు ఆపేయమని నిర్వాహకులు హెచ్చరించి ఒక వరం తర్వాత పరీక్షిస్తే వాళ్లలో సోర్ థ్రోట్  మానసిక సమస్యలు తలనొప్పులు తగ్గిపోతాయట. ఆత్మశాధన కోసం మాత్రమే ఈ వార్త.

Leave a comment