వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్ హౌస్. చక్కని ద్రుష్టి ఆరోగ్యవంతమైన చర్మం పుష్కలంగా ఖనిజాలు దొరకటంతో గోధుమ పిండి జ్యూస్ ని ఎంతో మంది రెగ్యులర్ గా  తీసుకుంటున్నారు. లివర్ బలోపేతం చేయటం బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమబద్దీకరించటం గుండెకు బలం ఇవ్వటం తో పాటు  ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కాన్సర్ రోగులకు సైతం వీరు తీసుకునే టాక్సిక్ మెడిసిన్స్ కు బాలన్స్ చేయటాన్ని సమర్ధవంతమగా నిర్వహిస్తోంది. మార్కెట్ లో వీట్ గ్రాస్ పౌడర్ ఫ్రోజెన్ వీట్ గ్రాస్ జ్యూస్ కూడా దొరుకుతుంది. ఇంట్లో తాజాగా తయారు చేసుకునే వీట్ గ్రాస్  లో వుండే పోషకాలు ఈ నిల్వ వుండే పౌడర్లలో దొరక్కపోవచ్చు. కానీ ఈ జ్యూస్ పిల్లలు పెద్దలు నిరభ్యంతరంగా తాగొచ్చని ఆరోగ్యమని చెపుతున్నారు.

Leave a comment