సోనమ్ కపూర్ పేరులోనే బంగారం ఉంది.ఒక ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ తనకు ఆభరణాలంటే ఇష్టమని చెబుతూ ,మా అమ్మ వారసత్వంగా వస్తున్న ఒక నగను నాకు ఇచ్చారు. నా దృష్టిలో అది విలువైంది. ఆభరణ పరిశ్రమలోకి నేను చాలా కాలం క్రితం అడుగుపెట్టాను. ఎన్నో పేరున్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. ఈ పరిశ్రమతో నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇది దేశానికి ఉపయోగపడే పరిశ్రమ కూడా. నా దృష్టిలో ఆభరణాలు ఒక పెట్టుబడి . బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఇవి ఆస్తి వంటివే. వజ్రాలు అమ్మాయిల బెస్ట్ ఫ్రెండ్స్. నా దగ్గర కూడా కొన్ని ఖరీదైన డైమాండ్స్ ఉన్నాయి. నాకు బంగారం పైన ఇన్వెస్ట్ చేయటం ఇష్టమే అంటోంది .ఈ సెలబ్రేటీ చెప్పినట్లు బంగారాన్ని ఆస్తిగా మాత్రమే భావించటం మంచిదే కదా.