Categories
అచ్చంగా వజ్రాల వంటి రాళ్లున్నాయి అవి మోయ్ సనైట్స్ వజ్రం కన్నా ఎక్కువగా మెరిసే కానీ వజ్రం తెల్లని మెరుపు ప్రసరిస్తే ఈ మోయ్ సనైట్స్ అన్ని రంగుల్ని ప్రతిఫలిస్తాయి. వజ్రం సైజు పెద్దదిగా ఉండాలి. తక్కువ ధరలో రావాలి అనుకునే వాళ్ళు ఈ ముచ్చట తీర్చుకుంటున్నారు . ఇది కృత్రిమంగా తయారయ్యే వజ్రం ఒక క్యారెట్ నిజమైన వజ్రం ధర రెండు లక్షల అయితే మోయ్ సనైట్స్ వెల 20 నుంచి 30 వేల వరకు ఉంటుంది. వీటికి రీసేలే వ్యాల్యూ కూడా ఉంటుంది. వజ్రాలకు బదులుగా ఇప్పుడు కుందన్ పోల్కి నగల్లో పెండెంట్లు హారాల్లో వీటిని వాడుతున్నారు. ముఖ్యంగా నిశ్చితార్థపు వజ్రపు ఉంగరం ఈ వజ్రం లోనే తయారు చేస్తున్నారు ధర తక్కువ లో ధరించాలనే కోరిక తీరుస్తుంది ఈ కుత్రిమ వజ్రం.