ముఖ సౌందర్యం కోసం చూపే శ్రద్ద పాదాలపై చూపించరు పగుళ్ళు పట్టించుకోరు. ఈ పగుళ్ళలో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వర్షాల్లో తేమ వల్ల చర్మం తొందరగా పగులుతోంది. ఈ వర్షాల్లో ఆయిల్ గ్లాండ్స్ ఉండక పోవటం వల్ల పొడి బారినట్లు అయిపోతాయి. పాదాలు చక్కగా తేమతో ఉండాలంటే రెండు సార్లు తప్పని సరిగా మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల వేళ్ళు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే ఇన్ ఫెక్షన్స్ వస్తాయి. వేళ్ళ మధ్యభాగం పొడిగా ఉంచుకోవాలి.వేళ్ళ మధ్యపగుళ్ళు రాకుండా నూనె ,పసుపు కలిపిన మిశ్రమం రాసుకొని మసాజ్ చేయాలి. పాదాలకు చెప్పులు అవసరం .రాత్రి వేళ ఏదైన క్రీమ్ రాసుకొని కాటన్ సాక్స్ వేసుకొని నిద్రపోతే పాదాలు శుభ్రంగా నాజూగ్గా అయిపోతాయి. మెంతులలో తయారైన ఫుట్ క్రీమ్ వాడటం మంచిది.

Leave a comment