వెక్కిళ్ళు వస్తే ఏం చేస్తారు? సాధారణంగా మంచి నీళ్ళు తాగుతాం కానీ అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు కొన్ని వున్నాయి. వెక్కిళ్ళు వస్తే నోటి నిండా పంచదార వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ వుంటే వెక్కిళ్ళు పోతాయి. శ్వాశ వీలైనంతగా బిగించి పట్టి నెమ్మదిగా వదలాలి. ఇలా చేసినా వెక్కిళ్ళు తగ్గుతాయి కప్పు పెరుగులో స్పూన్ ఉప్పు కలుపుకుని తిన్నా వెక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ వెక్కిళ్ళు వస్తు వుంటే తాజా అల్లం  ముక్క నోట్లో ఉంచుకుని నెమ్మదిగాఅప్పరించాలి. చిన్న పిల్లలకు ఎక్కిళ్ళు  వస్తే ఓ స్పూన్ పీనట్ బాటర్ ని నెమ్మదిగా చప్పరిస్తూ తినమంటే వెక్కిళ్ళు ఆగిపోతాయి.

Leave a comment