పండుగలు, వివాహాల కోసం ప్రత్యేకమైన  డ్రెస్సులు అందించే డిజైనర్లు మంచి లుక్ కోసం ఎంచుకునే వస్త్రశ్రేణిలో ఇకత్ ముందుంటుంది. ఇకత్ ప్రింట్స్ తో లేహంగాలు చాలా అందంగా వస్తాయి. బెనారస్, బోర్డర్స్ గోల్డ్ లేస్ ను కలిపిన ఇకత్ ప్రింట్స్ లేహంగాలు చెక్కని మెరుపులతో పండగ స్పెషల్ గా, ప్రేత్యేకంగా కనిపిస్తాయి. అలాగే మంగళ గిరీ సిల్క్ కుడా లేహంగా డిజైన్ చేసేందుకు అనుకూలంగా వుంటుంది. గోల్డ్ ప్రింటెడ్ తో సహజంగా నేసిన ఈ మంగళగిరి సిల్క్ లేహంగాలు, దుపట్టాలు భారీ గోల్డ్ మోటిఫ్స్ తో జత చేసిన లేహంగాలు , పట్టు, ధర్మవరం, కంచి వస్త్ర శ్రేణి తో పోటీ పడుతూ అందంగా వచ్చాయి. ఇకత్ ప్రింట్ లేహంగాలు వివిధ రంగులు, చక్కని ప్రింట్స్ తో పోచం పల్లి కళాకారుల ప్రతిభకు అద్దం పడుతున్నాయి.

Leave a comment