చాలాకాలం ఇంట్లోంచి పనిచేశాక ఇప్పుడిక ఆఫీస్ కు వెళ్లి పని చేయవలసిన సమయం వచ్చింది. ఎంతో గ్యాప్ తర్వాత మళ్లీ కొత్తగా పనిచేస్తున్నట్లు ముందు కొంచెం అలసట అనిపించవచ్చు. నెమ్మదిగా రొటీన్ కు అలవాటు పడాలి. పనిచేసే మహిళలు అందరికీ 24 గంటలే ఉంటాయి. ముందుగా పని వేళలను నిర్ణయించుకోవాలి విశ్రాంతి కోసం రాత్రి సమయం ఉంచుకోవాలి. సమావేశాలు డెస్క్ పని ఇతర పని ప్రాజెక్ట్ వర్క్ ని ఇంటి పని అన్ని ప్లాన్ ప్రకారం మాత్రం ఉండాలి. రోజు వారి పనుల జాబితా రాసుకోవాలి మనుషులు సూపర్ హీరోలు కాదు. ఇంట్లో పనులకు కూడా చేయలేని పరిస్థితి ఉంటే ముందుగా ‘నో’ చెప్పటం నేర్చుకోవాలి. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఇంటి పనులు సమిష్టిగా పూర్తి చేసే ప్లాన్ వుంటేనే ఉద్యోగం జీవితం సాఫీగా నడుస్తుంది.

Leave a comment