ప్రకృతిలో దొరికే పూలు కాయల తో తలనొప్పి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో ఈ చిట్కాలు అమోఘంగా పనిచేసేవని రుజువయ్యాయి. మిరియం అరగదీసి ఆ గంధం కనతలకు పట్టించాలి. సీతాఫలం ఆకు పసర తలకు మర్దనా చేయచ్చు. దాల్చిన చెక్క పేస్టు నుడురుకు రాసినా మంచి ఫలితం. మునగాకు రసంలో మిరియాలు పొడి కలిపి నుదుటికి పట్టించ వచ్చు. ఇంగువ అరగదీసి ఆ గంధాన్ని పట్టించినా సరే, లవంగాలను నూరి ఆ పేస్టు నుదుటికి పట్టీ వేయవచ్చు, తమల పాకుకు కొద్దిగా నూనె రాసి నుదుటి పై పట్టీలా వేయచ్చు. కొట్టిమీర రసం కణతలు నుడురుకు పట్టించినా తలనొప్పి పోతుంది. మందులు కనిపెట్టని రోజుల్లో వాడిన ఔషదాలు ప్రకృతిలో లభించే ఆకులు, పువ్వులే.

Leave a comment