నీహారిక,
ఈతరం అమ్మాయిలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇరువై ఏళ్ళు రాకుండానే కార్పొరేట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. చదువుల్లో ఉండగానే స్టార్టప్ లు ప్రారంభిస్తున్న్నారు. అయితే సంపాదన తో పాటు ఖర్చు పెట్టె విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపిస్తే భవిష్యత్ లో ఒడిదొడుకులు రాకుండా ఉంటాయి. ఎంత సంపాదిస్తున్న సరే అవసరానికి, విలాసలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇక ఆడంబరాలకు పోనే పోకూడదు. ఖర్చు పెట్టె ప్రతి పైసా అవసరమా, లేదా ఆలోచించుకోవాలి. సంపాదన మొదలు పెట్టే రోజు నుంచి అరవై శాతం ఖర్చులకు ఉపయోగించుకోవాలి. మిగిలిన డబ్బు దీర్గకాలక, స్వల్పకాలక లక్ష్యాలపై పెట్టుబడి పెడితే అది భవిష్యత్ గురించి భయం లేకుండా చేస్తాయి. నిపుణుల సాయంతో సురక్షిత మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇలాచేస్తే భవిష్యత్ గురించి భయం లేకుండా స్థిరమైన ప్రణాళిక తో జీవితం హాయిగా నడుస్తుంది.

Leave a comment