చిరుధాన్యాల కంటే ఓట్స్ లో పీచు చాలా ఎక్కువ.క్యాలరీలు 25 శాతం తక్కువ,అలాగే గ్లూటెన్ లేకపోవటం వల్ల విపరితంగా ప్రజాదారణ పొందుతున్నాయి. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం. వీటికి అనేక విధాలైన రుచులు కలిసి చక్కని ఆహారం తయారు చేసుకోవచ్చు. పండ్ల ముక్కలు ,నట్స్ మిల్క్ కలిపి రుచికరమైన ఆహారం తయారుచేసుకోవచ్చు. ఓట్స్ లో కాల్షియం,మెగ్నిషియం,జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఓట్స్ ఆహారంలో తీసుకుంటే బరువు పెరుగుదల ఆగుతుంది. రోల్ట్ ఓట్స్ లో నట్స్ తేనె కలిపి బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు. లంచ్ డిన్నర్ లకు కిచిడీ చేసుకోవచ్చు. స్నాక్స్ చేసుకోవచ్చు.ఓట్స్ రోజువారీ ఆహారంలో భాగంగా కావాలి. కానీ ఓట్స్ మాత్రమే ఆహారం కాదు.ఇతర ధాన్యాలతో కలిపి తినాలి. చారుధాన్యాలు ,పప్పు కలిపి తీసుకొంటే శరీరానికి కావలసిన పోషకాలు దొరుకుతాయి.

Leave a comment