రాత్రి ఎంత తక్కువ నిద్రపోయినా ఆ నిద్ర లేమిని మధ్యాహ్నం వేళ అరగంట నిద్రతో సరిచేయచ్చు అంటున్నారు అధ్యయన కారులు . 30 ఏళ్ళ లోపల వయస్సున్న వాళ్ళపై చేసిన ఒక అధ్యయనంలో వారి నిద్రను రాత్రి రెండు గంటల సేపు కు పరిమితం చేశారు . 8 గంటల నిద్రను రెండు గంటల కు పరిమితం చేస్తే నోరెపైన్ అనే హార్మోన్ స్థాయి రెండున్నర రెట్లు అధికంగా ఉంది . అలాగే ఒత్తిడి,అధిక రక్తపోటు అధిక రక్తంలో చక్కెరలు స్పందించే మరో నాడీ సంబంధిత రసాయనం పెరగటం గమనించారు . శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులతో పోరాడే ప్రోటీన్ ఇంటర్ ల్యూకిన్ -6 తగ్గటం కూడా గమనించాం అంటే నిద్ర లేకపోతే ఇన్ని అనర్దాలు వస్తాయి . అయితే దీనికి విరుగుడు మధ్యాహ్నం అరగంట నిద్ర పోవటం తో గుర్తించారు . ఈ ప్రయోగం లో పాల్గొన వారికీ మధ్యాహ్నం అరగంట నిద్రపోనిస్తే అనారోగ్య లక్షణాలు మాయం అయ్యాయి .
Categories