ఫిట్ నెస్ విషయంలో శ్రధ్ధ పెరిగాక వ్యాయమాలు విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు యువతులు.ఏరోబిక్స్ వంటి వ్యాయామం ఇక గంట పాటు చేస్తే మూడు నుంచి నాలుగు వందల కేలరీలు ఖర్చవుతాయి. జిమ్ లో గంట పాటు శ్రమ పడ్డాక నేరుగా ఆఫీస్ పనులకు లేదా ఇంటి పనుల్లో మునిగిపోతే సరైన ఆహారం అందకపోతే అలసట రావటం ఖాయం .చక్కని ఆహారం ,వ్యాయామం రెండూ సమాంతరంగా సాగాలి. అరటి యాపిల్ వంటి పండ్లు ఖర్జూరం లేదా ఎండుద్రాక్ష కావలసిన శక్తి ఇస్తాయి. ఉదయం లేచిన వెంటనే బాధం వాల్ నట్స్ వంటివి తీసుకొంటే కావలసినన్ని ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఆఫీస్ లేదా ఇంట్లో చేసే పని గంటలతరబడి శరీర కష్టంతోనే ముడిపడి ఉంటాయి. బొప్పాయి,ఖర్జూర, దానిమ్మవంటి పండ్లు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఆహారము అవసరం .గుడ్డు పాలు, పెరుగు ,చికెన్ ,చేప వంటివి భోజనంలో భాగంగా ఉండాలి. ఈ ఆహారం నాలుగు గంటలకొకసారిగా శరీరానికి అందితే ఆరోగ్యం.
Categories