నేనింత వరకు జిమ్ కె వెళ్ళలేదు కేవలం డాన్స్ చేస్తాను అదే నా ఫిట్ నెస్ రహస్యం అంటుంది సాయిపల్లవి. పైగా డాన్స్ ప్రొఫెషనల్ గా కూడా నేర్చుకో లేదు. నాకు చాలా ఇష్టం నేను స్వయంగా సినిమాల్లో చూసి నేర్చుకొన్నదే ప్రతి రోజు కచ్చితంగా డాన్స్ చేస్తాను ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు స్పెషల్ కేరఇంకేమితీసుకోలేదు అంటుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ లో ఆమె డాన్స్ కె ఫిదా అయ్యారు ప్రేక్షకులు ఈ విషయాన్ని నిపుణులు కూడా నిర్ధారిస్తున్నారు. ప్రతి రోజూ అరగంట పాటు డాన్స్ చేస్తే 200 నుంచి 400 కేలరీలు బర్న్ చేయవచ్చు అంటున్నారు మజిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి డైట్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని డాన్స్ ని జీవన విధానంలో భాగంగా ఎంచుకోమంటున్నారు ఫిజికల్ ట్రయినర్లు.

Leave a comment