Categories
ఐరన్, విటమిన్-సి,ఇ ఈ మూడు పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలటం చాలా వరకు అరికట్టవచ్చు అంటారు ట్రైకాలజిస్ట్ లు. ఐరన్ శరీరానికి సమృద్ధిగా అందాలి అంటే గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు వంటి నట్స్, సీ ఫుడ్ తీసుకోవాలి. శాకాహారులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాయగూరలు తినాలి. బత్తాయి నారింజ నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి అధికం. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుశనగ, వేట మాంసం లో జింక్ ఎక్కువే. వీటిని ఆహారంలో తీసుకుంటూ వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తూ జుట్టును శుభ్రంగా ఉంచుకోగలిగితే జుట్టు రాలటం తగ్గిపోతుందని బ్రిటిష్ న్యూట్రీషియన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్స్ చేస్తోంది.