కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్. తాజా కాయగూరలు, పండ్ల తోనే రకరకాల డిజర్ట్స్, సలాడ్స్ చేసే షెఫ్స్ నిండైన రంగుల్లో ఉండే కాయగూరలతో కనువిందుగా చేసే ఆహార పదార్ధాల్లో ఎన్నో ఆంతోసైనిన్లు, ఫైటో న్యూట్రియంట్లు అన్ని కలిపి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయని చెపుతున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్లు, తేనే కలిపి అందమైన అమరికతో స్టఫ్ చేసినవి అందమైన జార్స్ లో పారదర్శకం గా కనిపించేలా చేసి సర్వ్ చేస్తారు. లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి ఇదే. వెన్న లేదా నూనెలో వేయించిన ఉల్లిపాయలు, తాజా క్యాబేజీ ఆకులూ, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, జాజికాయ పొడి అన్నీ లేయర్లుగా అలంకరిస్తారు. వంటకాన్ని బట్టి నిమ్మరసం, వెనిగర్లు వాడతారు. సంప్రదాయ వంటలు కూడా కనువిందుగా అలంకరించడం ఈ లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి. ఉదాహరణకు పుదినా రైస్, టొమాటో రైస్, జీరా రైస్ కలిపి మూడు రంగుల లేయర్ లాగా అమర్చి వాటికి మిగతా డ్రెస్సింగ్ చేసి వడ్డిస్తే చూసేందుకు, తినేందుకు అద్భుతమే!
Categories
Wahrevaa

ఆహారాన్ని అలంకరించినా ఆరోగ్యమే

Leave a comment