పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగితే పుట్టే బిడ్డలు చక్కని రంగులో పుడుతారంటారు. ఈ అమెరికన్ శాఫ్రాన్ రేకుల్ని పచ్చిపాలలో వేసి నాననిచ్చి ,మొత్తగా చేసి ముఖానికి పట్టించి ,ఓ అరగంట ఆరాక కడిగేస్తే ముఖం చక్కని రంగులోకి వస్తుంది. మార్కెట్ లో వచ్చే లైటెనింగ్ క్రీముల కంటే ఈ పెస్ట్ బాగా పని చేస్తుంది. గంధంలో పాలు ,పసుపు కలిపి చేతులకు ,కాళ్ళకు రాసి ఆరాక కడిగేస్తే కమిలి పోయినా చర్మం మెరిసి పోతుంది. ముఖ్యంగా బాధం,ఆలివ్ నూనెలు కలిపి ఒంటికి ,మొహానికి పట్టించి మసాజ్ చేస్తే దుమ్ము ,ధూళి వదిలి చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి.ఆ తర్వాత ఏ ఫేస్ ఫ్యాక్ వేసిన చక్కని ఫలితం ఉంటుంది. బొప్పాయి గుజ్జులో ముల్తాను మట్టి కలిపి ఫేస్ పాక్ వేసినా చర్మం చక్కగా మృదువుగా ఉంటుంది.

Leave a comment