మహాబూబ్ నగర్ ,బాలానగర్ లో విరివిరిగా దొరికే సీతా ఫలాలు తియ్యాని గుజ్జుతో నోరూరిస్తాయి.కొండల్లో, గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగే సీతాఫలాల్లో ఎన్నో విటమిన్లు ఖనిజాలు,ఔషధగుణాలు ఉంటాయి. ఎక్కువ గింజలు ఉండటంతో తినేందుకు అనుకూలంగా ఉండవదని ఇష్టపడరు కాని పండే నేలను బట్టి ఈ కొండఫలం రుచి పెరుగుతూ ఉంటుంది.మనకి తెల్లనిగుజ్జున్న ఆకుపచ్చని పండ్లు దొరుకుతాయి. కానీ ఫిలిప్పిన్స్ ,మయన్మార్ లో ముదురు గులాబీ రంగు సీతా ఫలం రుచిగా కూడా ఉంటుంది. అలాగే బంగారు వర్ణంలో ఉండే సూపర్ గోల్డ్ ,తెలుపు లేతాకు పచ్చ కలగలసిన ఎన్,ఎమ్ కె1,గోల్డెన్ రకాల్ని మహారాష్టంలో పెంచుతున్నారు.ఆకుపచ్చ గులాబీ రంగుల కలగులుపుకొని ఉండే థాయ్ రకం పండ్లు చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment