కొన్ని చిరు ధాన్యాలు బరువు తగ్గేందుకు సహాయ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులు విటమిన్-బి దొరికే జొన్నలు ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం ఉండే సజ్జలు బరువు తగ్గిస్తాయి. జొన్నలు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ 20 శాతం శరీరానికి అందుతుంది. సజ్జలతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రాగి పిండి పిల్లలకు చాలా మంచిది, ఇందులో ఉన్న ఆమెను యాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సాయపడతాయి. జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చిరుధాన్యాల లో కొవ్వులు చాలా తక్కువ శాతం లో ఉంటాయి. వీటి పై పొరల్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయి.

Leave a comment