వర్షాల సమయంలో వేడిగా ఉండే సూప్ లు తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు. వేడిగా ఉండే సూప్ లు హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. వాటిలో వేసే కూరగాయల్లో ఉండే బి-విటమిన్,విటమిన్-ఎ యాంటీ ఆక్సిడెంట్లు పీచు మొదలైనవన్నీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు సాయపడతాయి. సూప్ ల్లో వాడే అల్లం వెల్లుల్లి మిరియాలు దాల్చిన చెక్క పొడి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి వచ్చే వైరస్ లు బాక్టీరియాలు వచ్చే జలుబు, జ్వరం రాకుండా ఉండేందుకు సూప్ లు ఔషధాల్లాగా పనిచేస్తాయి అంటున్నారు.

Leave a comment