ఆడ పిల్లలు ఎదిగే క్రమంలో ప్రతి దశలోనూ కొన్ని ఒత్తిడులు ఉంటాయి. వీటిని దాటి రావాలంటే క్రమం తప్పకుండా కొన్ని ఆహారపదార్ధాలు తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పు లో ఉండే విటమిన్-బి2, విటమిన్-ఇ శరీరం లో సెరటోనిన్ ఉత్పత్తికి సాయం చేస్తాయి. ఈ సెరటోనిన్ వత్తిడి వ్యాకులత ఎదురవకుండా పోరాడుతూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కనుక ప్రతిరోజూ బాదం పప్పులు తినాలి. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ను అదుపులో ఉంటే తాజా కమల, బొప్పాయి, జామ పండు తినాలి. మెగ్నీషియం పుష్కలంగా ఉండే పాలకూర తినాలి. ఇది కూడా కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

Leave a comment