వైవాహిక జీవితంలో వచ్చే గొడవలు,కలతలు,కలహాల వల్ల మధుమేహం వంటి అనారోగ్యాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్నా వాళ్ళు సంసార జీవితంలో తరచు గొడవలు పడుతూ ఉంటే బాధ మరింత పెరుగుతోందంటున్నారు. వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యం పైన అనుకూలమైన ప్రభావం చూపెడుతోంది. అదే భార్య భర్తలు ఘర్షణ పడితే ఆ ప్రభావం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక వేదన నొప్పుల్ని పెంచుతోంది. ఘర్షణ తో మనసులో రేగే వత్తిడి వల్లే అనారోగ్యాలు పెరుగుతాయంటున్నారు. పంతాలు పట్టింపులకు స్వస్థి పలికి కుటుంబ జీవితాన్ని సంతోషంగా అను భవించ మంటున్నారు.

Leave a comment