ఈ సంవత్సరం మీ పుట్టిన రోజున తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏమిటి అన్న ప్రశ్నకు ఎంతో అందమైన సమాధానం ఇచ్చింది ప్రియాంక చోప్రా. మా పర్పుల్ పెబ్బెల్ ప్రోడక్షన్స్ లో పని చేస్తున్న ప్రతి మహిళా ఉద్యోగికీ పన్నెండు వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రసవం కోసం ఆర్ధిక సాయం ఎటూ ఉంటుంది. మా సంస్థలో 80 శాతం మంది వివాహితులే . ఈ నిర్ణయంతో వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అంటోంది ప్రియాంక. మహిళలకే కాదు పురుషులకు కూడా భార్య ప్రసవిస్తే ఆమెను బిడ్డనూ చూసుకొనేందుకు రెండు వారాలు సెలవు ఇస్తున్నాం దీన్నీ ఇంకాస్త పెంచితే బావుంటుంది అని ఆలోచిస్తున్నా అంటోంది ప్రియాంక చోప్రా.

Leave a comment