Categories
వెయ్యి కిలోల బంగారంతో చిన్న అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఈ సువర్ణ కాంతుల ఆలయం రాజస్థాన్ లోని అజ్మీర్ జైన్ ఆలయం వెనకే ఉంటుంది. అయోధ్య నగరం హిందువులకే కాదు జైనులకు పుణ్యస్థలమే. జైన్ తొలి తీర్థంకరుడైన వృషభ నాథుడి (ఆదినాథుని) జన్మస్థలం అదేనని వాళ్ల నమ్మకం. అందుకే 1865 లో అజ్మీర్ లో ఆదినాథుని ఆలయం ఏర్పాటు చేసినప్పుడు ఆయన జన్మించిన అయోధ్యని బంగారంతో నిర్మించాలనుకున్నారు. ఆలయం వెనక భాగంలో కట్టిన ఒక స్వర్ణ అయోధ్యలో ఆదినాథుని జీవిత క్రమాన్ని ఐదు ఘట్టాల్లో వివరించే వందలాది ప్రతిమలు ఉంటాయి. మేరు పర్వతం నమూనాని ప్రతిమలు అన్నింటిని బంగారు రేకును తాపడం చేశారు ఇందుకు వెయ్యి కిలోల బంగారం వాడారు.