ఏకె వెర్సెస్ ఏకె  నెట్ ఫ్లిక్స్ లో తాజాగా విడుదలైంది. ఏకె అనిల్ కపూర్ ఏకె  అనురాగ్ కశ్యప్.వీళ్లు ఇద్దరూ ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉంటారు ఈ సందర్భంగా వచ్చిన ఒక చిన్న తగువు వస్తుంది.హీరో కుమార్తెను డైరెక్టర్ కిడ్నాప్ చేస్తాడు .ఈ విషయం చెప్పిన ముందుగా అనిల్ కపూర్  నమ్మడు ఇంటికి ఫోన్ చేసి తెలుసుకుని, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాడు.అక్కడ కూడా జరుగుతున్నది సినిమా అనే అనుకుంటారు అలా అనుకునేలా ప్లాన్ చేస్తాడు అనురాగ్ కశ్యప్.దాన్ని మొత్తం వీడియో తీసేందుకు కెమెరా ఉమన్ వెంటనే ఉంటుంది.కిడ్నాప్ చేసిన అనురాగ్ కశ్యప్ నువ్వు ఒక్కడివే తెల్లారేలోపు నీ కూతుర్ని కనుక్కోవాలి అని కండిషన్ పెడతాడు. అతన్ని పబ్లిక్ లో అవమానించినందుకు తీర్చుకుంటున్న కక్ష ఇది అంటాడు కూతురి కోసం కలవరపడి పోయే తండ్రి ఆ కెమెరా షూటింగ్ తో పాటు ఎంతో పరిగెత్తి ప్రాధేయపడి చివరకు కూతుర్ని కనుక్కుంటాడు అనురాగ్ కశ్యప్,అనితా కశ్యప్ చేసిన ఒక ప్రయోగం ఈ సినిమా సినిమాలో సినిమా…నిజ జీవిత పాత్రలతో సినిమా చాలా బావుంది తప్పకుండా చూడవచ్చు.
రవిచంద్ర. సి
7093440630

Leave a comment