ఇప్పుడు ఆంధ్రాలో వర్టికల్ ఫామ్స్ వెలుసున్నాయి. ఈ విలువెత్తు తోటలో నగర కాలుష్యాన్ని హరించేందుకు మంచి గాలి ఇచ్చేందుకు ఉద్దేశించినవి. సింగపూర్ ,అమెరికా వంటి దేశాలల్లో ఈ నిలువెత్తు తోటల్లో తాజా కూరగాయాలు పండించేస్తున్నారు. హైడ్రోఫానిక్స్ ,ఏరో ఫానిక్స్ ఆక్వా ఫామింగ్ పద్దతులలో ఈ నిలువెత్తు తోటలను పెంచవచ్చు అంటున్నారు నిఫుణులు. జనాభా తగిన నిష్పత్తిలో భూమి లేని భారతదేశానికి నిట్టనిలువు తోటలే మేలు అన్నది వ్యవసాయ నిపుణుల అభిప్రాయం. కేరళలో కూడా ఇప్పుటికే వర్టికల్ ఫామ్స్ కోసం రకరకాల ట్రైల్సీలను రూపొందించి కూరగాయాలు పండించటం ప్రారంభించింది. ఔషధ మొక్కల్ని కూడా చాలా తేలికగా ఈ నిలువెత్తు ఉద్యానవనాల్లో పెంచవచ్చు అంటున్నారు. మట్టి లేకుండా హైడ్రోఫానిక్స్ పద్దతిలో ఈ నిలువెత్తు ఉద్యానవనాల్లో కూరలు ,పూవులు పండించుకోవచ్చు.
Categories