Categories
సెంటిమెంట్లు తప్పే కానీ అలా కుదిరింది మరి. ఒక సారి ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్ళినప్పుడు మరిచిపోయి రెండు వాచ్ లు పెట్టు పోయాను మా జట్టు గెలిచింది. అలాగే కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాను అప్పుడు మా టీమ్ కే గెలుపు ఇక ప్రతి మ్యాచ్ కు రెండు వాచ్ లు కాలు మీద కాలు సెంటి మెంటయి కూర్చున్నాయి అంటుంది శిల్పా శెట్టి. ఆమె నటి మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా గతంలో ఇలాంటి నమ్మకాలు ఉండే సమయం కూడా లేదు కానీ రాజస్థాన్ రాయల్స్ యజమాని అయ్యాక మాత్రం సెంటిమెంట్స్ వదలటం లేదు అంటుంది శిల్పా శెట్టి నమ్మకంగా. పైగా ఇవన్నీ సిల్లీ సెంటిమెంట్స్ అని ఆమె అంటుంది.