Categories
గోవాలో ‘మ్యూజియం ఆఫ్ గోవా’ ( ఎం ఓ జి) కి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శారద కేల్కర్.ఆమె పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ చేసింది.చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం గురించి తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది .గ్రాఫిక్ డిజైనింగ్,ఫ్యాషన్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్,గేమింగ్ సృజనాత్మక ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద.’అమి గోవా ‘అనే నాన్ ప్రాఫిటబుల్ సోషల్ ఎంటర్ ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద కేల్కర్.ఆమె చొరవతో గోవా హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీ కొత్త రూపం పోసుకొంటోంది.