ఇంట్లో ఉండే ఇద్దరు అక్కా చెళ్లెల్లు లేదా ప్రాణ స్నేహితులు ఒకే లాంటి దుస్తులు ధరించేందుకు ఇష్టపడతారు. ఒకళ్ళకు ఆధినికమైన దుస్తులు ఇష్టం,మరొకరికి చీరలు ఇష్టం. అచ్చం ఒకేలాంటి డ్రెస్ ఇద్దరు వేసుకుంటే బావుంటుంది అనుకుంటారు. అలా ప్రత్యేకంగా డిజైన్ చేసిందే సల్వార్ చీరె కాంబో డిజైన్.అలాగే చీరెలు కట్టుకునే తల్లులు సల్వార్ వేసుకునే కూతుళ్ళు కూడా ఇష్టపడే డ్రెస్ ఇదే. అలాగే కొన్ని కార్పోరేట్ ఆఫీసుల్లో ఎంప్లాయిస్ అందరు ఒకే రకం డ్రెస్ కోడ్ లో ఉంటారు. అలాంటప్పుడు ఈ సరికొత్త మ్యాచింగ్ డ్రెస్ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.

Leave a comment