Categories
సెలవులు, ప్రశంశలు ప్రమోషన్ లు దొరకని ఉద్యోగం గృహిణిది.యు.కె లో ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక గృహిణి జీతం ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అన్న ప్రశ్నకు తిరుగులేకుండా నెలకు ఆరు లక్షలు ఇవ్వచ్చు అని సమాధానం వచ్చింది.మల్టీటాస్కింగ్ కు దొరికిన బహుమతి అదే మన ఇండియాలో అయితే 45000 ఇవ్వచ్చు అని తేల్చారు ఇద్దరు పిల్లల సంరక్షణకు 12000, వంట పనికి ఆరువేలు, ఇంటి పనికి మూడువేల ,ఇంటి బడ్జెట్ నిర్వాహణకు 4000, పెద్దల సేవకు 6000, ట్యూషన్ నెలకు 6000, బయటి పనులు నిర్వహణకు 8000 ఇవ్వవచ్చునని కష్టానికి లెక్కగట్టారు. ఇదొక అందమైన కాలే గానీ కనీసం కాస్త గౌరవం విశ్రాంతి ఇస్తే చాలు కదా అంటారు మనసున్న వాళ్ళు.