Categories
2017 నుంచి ‘అమృతం’ పేరుతో తల్లిపాల సేకరణ ప్రారంభించారు రూపా సెల్వనాయకి. పాపాయి పుట్టాక తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేయమంటూ ప్రచారం చేశారు. నవజాత శిశువుల జీవన్మరణ సమస్య అని అర్థం చెప్పి ఆసక్తి ఉన్న వాళ్ల దగ్గర చనుబాలు సేకరించి ప్రభుత్వం మిల్క్ బ్యాంక్ లకు పంపిస్తారు. రూపా సెల్వ నాయకి ఎంతో మంది వాలంటీర్ల సాయంతో ఏటా వేల లీటర్ల పాలు బ్యాంక్ కు అందిస్తారు.ఈ ఒక్క ఏడాది 3.5 వేల లీటర్ల తల్లిపాలు సేకరించారు రూప.తమిళనాడు తో పాటు ఆంధ్రప్రదేశ్, ముంబై, కర్నాటక లోని వేల మంది శిశువులకు ఇది ప్రాణాధారం.