Categories
Nemalika

అమ్మాయిలకు కావాల్సినదేమిటి?

నీహారిక,

ఒక సరదా న్యుస్ నీకు షేక్ చేస్తున్న. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అని ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే లో అమ్మాయిలు అందం, రూపం, ఏవీ పట్టించుకోలేదట అమ్మాయిలు. ధైర్యంగా వుండాలని, ఎప్పుడైనా ఏదైనా సింహం లాగే ధైర్యంగా చేయాలనుకుంటారట. జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. ఉదయాన్ని నిద్ర లేచి వ్యక్తికి ఓటేస్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేచే వారు, ఇతరులను ప్రోత్సహిస్తారట. కష్టమైన పని వచ్చినా అది కష్టం అని భావించకుండా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, అనవసరంగా నటించని వాళ్ళను ఇష్టపడతారట. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఈ రెండింటిని గౌరవించే వ్యక్తి అయివుండాలి. అలాగే ఇతరులకు సహాయం చేసే గుణం వుండాలి. భాగస్వామీ అవసరాలు తలుసుకుని, వాళ్ళ కోరికలను గౌరవించే వాడుగా వుండాలి. అమితంగా ప్రేమించే వ్యక్తి అవ్వాలి. తమ రిలేషన్, వ్యక్తిగత వర్క్ లైఫ్ అన్నింటి వల్ల వచ్చే రిస్క్ లను అర్ధం చేసుకుని ఆదరించాలి. ప్రేమా విషయంలో ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. తన భాగస్వామితో గడిపిన స్వీట్ మెమోరీస్ గుర్తు పెట్టుకోవాలి. వాటిని జాగ్రత్త చేసే వాడై వుండాలి. ఇంకా ఈ లిస్టు ఎంతో వుంది అనుకుంటాం కానీ అమ్మాయిలు భాగస్వామి విషయంలో ఎన్నో ఎక్స్ పెక్ట్టేషన్స్ తో వున్నారని మాత్రం అర్ధం అయింది.

Leave a comment