శృతి హాసన్ తెర పైన అంద చెందాల తో మెరిసిపోవడమే కాదు, సీరియస్ గా స్త్రీ శక్తికి సంబంధించి విడియోలు ఫేస్ బుక్ లు పోస్ట్ చేయడమే కాదు తన పైన తనే జోక్స్ వేసుకోగల సెన్సాఫ్ హ్యుమర్ వున్న అమ్మాయి. తన చిన్నప్పుడు వెండక్కయ్ అని కుటుంబంలో పిల్లలంతా పిలిచే వాళ్ళట. బెండకాయలను తమిళంలో వెండక్కయ్ అంటారు. బెండకాయ తింటే బాగా చురుకోస్తుందని తల్లులు సహజంగా పిల్లల్ని మాయిచేసేందుకు బెండకాయ కూర ఇష్టంగా తినిపించేందుకు చెపుతున్నట్లే శృతిహస్సన్ కు ఆ బుజ్జగింపు వినిపించింది. ఇక అస్తమానం బెండకాయ కురే కావాలని అడిగారట లంచ్, డిన్నర్, ఇంకా అస్తమానం ఎప్పుడు తిన్నా అదే కూర. కుటుంబంలో పిల్లల తో తనే పెట్టిందట. మిగతా పిల్లలంతా ఆమెను అక్కా అని పిలిచే వాళ్ళు. ఇతరులు, ఏ అక్కరా అని అడిగితె వెండకాక్కా అని వెండక్కయ్ ను అక్కను కలిపి వెండకాక్కా అని పిలిచేవాళ్ళట. పొనీ బెండకాయలు తిన్నందు వల్ల మర్కులేమైనా గొప్పగా వచ్చాయి అంటే వందకు 26 మార్కులు మించలేదట. అంచేత లెక్కలు రావాలంటే కష్టపడి నేర్చుకోవాలని కానీ బెండకాయలు తింటే రావండోయ్, అని చెపుతుంది శృతి హాసన్. ఇప్పటికి తన అకౌంట్స్ లో వీకేనట!

Leave a comment