నీహారికా,
పిల్లల గురించి ఈ మధ్య కాలంలో మనం ఊహించ లేని సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. పిల్లల్లో చాలా అసహనం, కోపం, చిరాకు, పెద్దవాళ్ళను విసుక్కోవడం, వాళ్ళ మాటలు వినిపించుకోక పోవడానికి కారణం వాళ్ళు వాడే సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాయి పరిశోధనలు. చెప్పే కారణం కుడా స్పష్టంగా వుంది. పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో వుండే స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్, రెమొట్ వంటివి వాళ్ళ ఆజ్ఖిపాలిస్తాయి. చెప్పిన మాట వింటాయి. ఒక్క క్షణంలో ఇష్టం లేని చానల్ ను మార్చే ఆప్షన్ వుంది. అలా పెద్ద వాళ్ళు చటుక్కున వాళ్ళ మాట వినకపోతే పిల్లలకు కోపం వస్తుందిట. నిజమే చాలా మంది పెద్దవాళ్ళకు పెత్తనం చేయడం అలవాటైపోతుంది. పిల్లలు ఎదుగుతూ లేదా కొత్తగా భార్య గృహం లో ప్రేవేసం చేసి, వాళ్ళకి సొంత ఆలోచనలు వున్నాయని చెప్పబోతే కోపం వస్తుంది. ఇంట్లో అందరు తమ మాట వినాలని సంపాదించే యజమాని ఆశించడం అన్నమాట అలా ఇంట్లో ఎవరు చెప్పినా కోపమే . అచ్చం ఇలాగీ పిల్లలు సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పది, తాము చెప్పినట్లు వినే వస్తువులను రెమొట్ తో ఆన్ అఫ్ చేయటాన్ని ఎంజాయ్ చేసి. చుట్టూ వున్నా పెద్దవాళ్ళు అలా వాళ్ళకు అనుకూలంగా లేకపోతె కోపం తెచ్చు కుంటారన్నమాట. సో ఇప్పుడు ఎం చేయాలి. వాళ్ళ చేతికి ఎం దొరకగుదదో ఆలోచించాలి.