పువ్వులోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అమృతాన్ని మరిపించే దివ్య ఔషధం తేనె. ఒకప్పటి తేన ఒక్కటే రంగు ఒకటే రుచి కానీ ఇప్పుడు భిన్నమైన రంగుల తేనెలున్నాయి. పసుపు, ముదురు కాఫీ, నలుపు, బూడిద వర్ణపు తేనె ఉన్నాయి. యూకలిప్టస్, నిమ్మజాతి వృక్షాల చుట్టూ తిరిగి తేనెటీగ సేకరించే తేన ఘాటైన రుచి వాసనతో ఉంటుంది. శుద్ధి చేయని ముడి తేనెలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైములు ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహార పదార్ధం తేనె ఒక్కటే. ఆయుర్వేదం అల్లోపతీ అన్న తేడా లేకుండా అన్ని రకాల వైద్యులు దీన్ని వాడమని సిఫారస్ చేస్తారు. శ్వాసకోశ వ్యాధులకు తేన మించిన ఔషధం లేదు. తేనె లో నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే బరువు తగ్గిపోతారు. వ్యాయామం తర్వాత తేనె తీసుకుంటే అలసట ఉండదు. మచ్చలను మాయం చేయటంలో తేనె ని మించింది ఇంకొకటి లేదు. చర్మ సౌందర్యానికి తేనెకు సాటి లేదు . ఇది సహజమైన మాయిశ్చరైజర్ మొహానికి ప్యాచ్ లాగా వేస్తే చర్మానికి చక్కటి నిగారింపు వస్తుంది. తేన పొడిబారిన కురులకు జీవం పోస్తుంది. తేనెలో వుండే ఖనిజాలు, విటమిన్లు లెక్క వేసి చూస్తే ఇది పోషక లేమితో బాధపడే వారికి అతి చక్కని పోషకాహారం తక్షణ శక్తిని ఇచ్చే తేనె ను రోజుకో స్పూన్ అయినా తీసుకుంటే మేలు!
Categories