బాగా పొడుగ్గా అందంగా కోరుకొంటారు ఎత్తు సాధారణంగా వంశ పారంపర్య లక్ష్యం. కానీ 15 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్లలోగా ఆహారం నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే పెరిగే ఎత్తు పూర్తిగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. 19 ఎల్లా వయసు వచ్చే వరకు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం బావుండేలా ఆహారంలో ప్రోటీన్లు కాల్షియం విటమిన్-డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి ప్రొటీన్ల కోసం గుడ్డు,మాంసం,చేపలు,పాలు,పెరుగు, పప్పు ధాన్యాలు,బాదం, ఆక్రోట్,పిస్తా,  వంటి గింజలు తప్పని సరిగా తీసుకోవాలి ఆకుకూరలు పాలు పెరుగు పన్నీర్ . మొదలైన ఆహార పదార్ధాల్లో క్యాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అర లీటర్ నుంచి ముప్పావు లీటర్ పాలు లేదా పాల పదార్ధాలు తీసుకొంటే రోజుకు సరిపడా కాల్షియం లభిస్తుంది.విటమిన్ డి కోసం రోజూ ఒక అరగంట సమయం ఎండలో తిరిగితే సరిపోతుంది రోజు కనీసం రెండు వేల కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవటం, 30 నుంచి 60 నిమిషాల పాటు వేగంగా నడవడం పరిగెత్తుట ఏదైనా ఆటలు ఆడటం వంటివి చేస్తే పొడవు పెరిగే అవకాశం మెరుగవుతుంది. రాత్రి కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వంశపారంపర్యంగా ఎంత ఎత్తు పెరగలరో అంత పెరగడం గ్యారంటీ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎత్తు పెరిగెందుకు  పనికివస్తాయని చెబుతున్నా ప్రాణాంతకమైన ఆపరేషన్ల జోలికి పోవద్దని, సహజంగా ఎత్తు పెరిగే మార్గలే చూడమని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment