Categories
వాసన పసిగట్టటంలో మనిషికీ మనిషికి కొంత తేడా ఉంటుందంటారు. కానీ ముక్కులు మటుకు చాలా చురుగ్గా పనిచేస్తాయట. మగవాళ్ళ ముక్కల కంటే ఆడవాళ్ళ ముక్కులు ఎందుకు చురుగ్గా ఉంటాయో అన్న విషయం,తెలుసు కొనేందుకు బ్రెజిల్ కి చెందిన శాస్త్రవేత్తలు ‘iso tropic fraetionators’ అన్న పరీక్ష రూపొందించారు. ఈ పరీక్షలో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్క పెట్ట వచ్చు నాటి ఈ పద్దతిని ఉపయోగించి వాసనకు సంబందించిన న్యూరాన్లు ఆడవాళ్ళలో 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు బహుశా ఆడవాళ్ళకి పుట్టుక తోనే వాసనకు సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. బయట వర్షం పడుతున్న,ఎక్కడైనా మంటలు చెలరేగుతున్న ఆడవాళ్ళ ముక్కులు వాటిని త్వరగా పట్టేస్తాయంటున్నారు.