తమిళనాడు లోని తిరుప్పూర్ కు చెందిన విచిత్ర సెంథిల్ కుమార్ స్థాపించిన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఎంతోమంది పిల్లలకు ప్రాణదానం చేసింది. గత నాలుగు సంవత్సరాల లో నాలుగు వేల లీటర్ల చనుబాలు ఆమె సేకరించి,తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల కోసం ఇచ్చారు. అనారోగ్యాలు ఇతర కారణాలవల్ల పాలు ఇవ్వలేని తల్లుల పిల్లలకు కూడా ఈ పాలు అందుతున్నాయి.తిరుప్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తో కలిసి ఈ మిల్క్ బ్యాంక్ నడుస్తోంది. విచిత్ర కోయంబత్తూర్ జిల్లా మహిళా ఫుట్బాల్ జట్టులో సభ్యురాలుగా 1999- 2002 మధ్య అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

Leave a comment